telugu navyamedia
telugu cinema news trending

నటుడు సుభాష్ చంద్రబోస్ .. ఆరోగ్యం విషమం..

actor subashchandrabose health is serious

ప్రమాదవశాత్తు కిందపడటంతో తలకు గాయం అయిన టీవీ, సినీ నటుడు సుభాష్‌చంద్రబోస్‌ అలియాస్‌ బోస్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటున్నారు వైద్యులు. కిందపడినప్పుడు తగిలిన దెబ్బతో, తలలో రక్తం గడ్డకట్టి ప్రాణాపాయ స్థితికి చేరాడు. సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొం దుతున్న బోస్‌ను టీవీ, సినీ నటుల బృందం పరామర్శించింది. నగరంలోని కృష్ణానగర్‌లో ఉంటున్న సుభా్‌షచంద్రబోస్‌ (40) వారం క్రితం ఇంట్లో కింద పడిపోవడం తో తలకు బలమైన గాయమైంది.

వైద్య పరీక్షల నిమిత్తం 24న గాంధీ ఆస్పత్రిలోని చేర్చారు. తలలో రక్తం గడ్డకట్టడంతో ఆయన పరిస్థితి విషమంగా మారింది. టీవీ యాంకర్లు, నటులు ప్రీతినిఘమ్‌, నగేష్‌, మధుమణి, ఫిలిం ఆర్టిస్ట్‌ సంఘం మాజీ ఉపాధ్యక్షుడు గుత్తికొండ భార్గవ్‌, రమేష్‌, రాజేంద్రప్రసాద్‌, ఫిలిం ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లాల్‌ బహుదూర్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ శ్రావణ్‌కుమార్‌ను కలిసి బోస్‌ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని సూపరింటెండెంట్‌ తెలిపారు. బోస్‌ అల్లరి రాముడు, కొంచెం ఇష్టం.. కొచ్చెం కష్టం, నిన్నే పెళ్లాడుతా, ఈడియట్‌, ప్రేమించి చూడు, ప్రేమఖైదీతో పాటు టీవీ సీరియల్స్‌లో నటిస్తున్నారు.

Related posts

విజయ్ దేవరకొండ “హీరో”కు సమస్య

vimala p

ఏపీసీఎం జగన్ .. శాసనసభలో…

vimala p

తెలుగుదేశం వెబ్ సైట్ .. కూడా పాయే.. !!

vimala p