telugu navyamedia
Uncategorized వార్తలు సినిమా వార్తలు

శోభన డ్యాన్స్ ఎంత బాగా చేసిందో.. వీడియో వైరల్..!!

సీనియర్ నటి శోభన మంచి డ్యాన్సర్ అన్న సంగతి తెలిసిందే.. క్లాసికల్ డ్యాన్స్ ను ఎంత బాగా చేస్తుందో అందరికీ తెలిసిందే.. చాలా కాలం నుంచి ఆమె సినిమాలలో కనిపించలేదు..అయితే సోషల్ మీడియా ద్వారా మాత్రం అప్పుడప్పుడు పలకరిస్తుంది. ఇకపోతే శోభన తాజాగా ఓ వీడియో ను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. ఇటీవల కాలంలో అనారోగ్యం కారణంగా మరణించిన గాన గాందర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారికి నివాళులు అర్పిస్తూ ఒక పాటను అంకితం చేసింది. ఎంతో చక్కగా ఆ పాటకు తగ్గట్లు నాట్యం చేసింది. ఆ వీడియో ఫుల్ కామెంట్లు లైకులు సోషల్ మీడియా లో ట్రెండ్ అయ్యింది.

 

ఇప్పుడు మరోక వీడియో ను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది..ఈ వీడియోలో ఆమె మరో భరతనాట్య కళాకారిణితో కలిసి భరతనాట్యం చేస్తోంది. నాట్యంలోని కొత్త కోణాలను ఆవిష్కరిస్తున్నామని తెలుపుతూ వీడియో ను షేర్ చేసింది.. ఆ వీడియో కొంచం ఫన్నీగా ఉండటంతో అందరూ బాగా నవ్వుకున్నారు.. అంతేకాదు ఇలా కూడా డ్యాన్స్ చేస్తారా అంటూ కామెంట్లు చేస్తున్నారు.. ప్రస్తుతం ఆ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది..

Related posts