telugu navyamedia
సినిమా వార్తలు

శివాజీరాజా రిటర్న్ గిఫ్ట్ ఇదేనా ?

Sivajiraja

ఇటీవల (మా) మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో శివాజీరాజా ప్యానల్, నరేష్ ప్యానల్ పోటీ పడగా, అందులో నరేష్ ప్యానల్ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో నరేష్ కు మెగా ఫ్యామిలీ, నాగబాబు, మహేష్ బాబు, నాగార్జున లాంటి వారంతా నరేష్ కు తమ సపోర్ట్ చేశారు. అయితే స్పెషల్ గా నరేష్ కు నాగబాబు చేసిన సపోర్ట్ కీలకంగా మారింది. అంతేకాదు ప్రెస్ మీట్ లో శివాజీరాజాకు ఎందుకు సపోర్ట్ చేయడం లేదో వివరణ ఇస్తూ నాగబాబు చేసిన వ్యాఖ్యలకు, ఇప్పుడు శివాజీరాజా ఇచ్చిన కౌంటర్ హాట్ టాపిక్ గా మారింది. ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన శివాజీరాజా వృద్ధులైన కళాకారుల కోసం ఓల్డేజ్ హోమ్ కట్టాలనేది తన కలని, కానీ దానిపై నీళ్లు చల్లారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తనకు 30 ఏళ్ళ నుంచి స్నేహితుడైన నాగబాబు తనకు గిఫ్ట్ ఇచ్చాడని, త్వరలోనే తాను కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని వ్యాఖ్యానించడం గమనార్హం.

కాగా శివాజీ రాజా వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం. ఆయన త్వరలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఇవాళ ఎన్నికల ప్రచారానికి బ్రేక్ ఇచ్చిన జగన్ లోటస్‌పాండ్‌‌లోనే ఉన్నారు. ఇప్పటికే మా మాజీ అధ్యక్షుడు అపాయింట్మెంట్ తీసుకున్నారని తెలుస్తోంది. శివాజీరాజా వైసీపీలో చేరతారని పెద్ద ఎత్తున పుకార్లు వస్తున్నాయి. అయిది ఇందులో నిజమెంతో ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటికే పలువురు సీనియర్ నటులు వైసీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.

Related posts