telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కోలీవుడ్ స్టార్ హీరో అమ్మాయిని ర్యాగింగ్ చేశారు… పృథ్వీ షాకింగ్ కామెంట్స్

Prithvi

సినీ నటుడు పృథ్వీ తెలుగు సినిమాల్లో కనిపించడం బాగా తగ్గిపోయింది. బెంగళూరులో సెటిల్ అయిపోయిన పృథ్వీ ఇటీవల జబర్దస్త్ కామెడీ షోలో కనిపించి సర్‌ప్రైజ్ చేసారు. ఈ వయసులోనూ ఆయన హ్యాండ్సమ్‌గా ఉన్నారు. తెలుగులో అవకాశాలు వస్తే తప్పకుండా నటించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో తాను అజిత్‌ని తప్పుగా అర్థం చేసుకున్నానని అన్నారు. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్, పృథ్వీ సోదరి ఒకే స్కూల్లో చదువుకున్నారట. అయితే పృథ్వీ చెల్లెలు ఇంటికి రాగానే ఆమె డ్రెస్‌కు బబుల్ గమ్ అంటుకుని ఉండేదట. రోజూ ఇలాగే జరుగుతుంటే పృథ్వీ ఏం జరిగిందని అడిగారట. అప్పుడు ఆమె స్కూల్లో అజిత్ అనే వ్యక్తి ర్యాగింగ్ చేస్తున్నాడని చెప్పిందట. అయితే పృథ్వీ అజిత్ కుమార్ ర్యాగింగ్ చేస్తున్నాడనుకుని అతనిపై కోపం పెంచుకున్నాడట. ఆ తర్వాత ఇదే విషయం అజిత్‌కు చెబితే.. ర్యాగింగ్ చేసింది అజిత్ కుమార్ కాదు అజిత్ మేనన్ అని తెలిసిందట. దాంతో తాను ఎంత తప్పుగా ఆలోచించాను అనుకుని పృథ్వీ బాధపడ్డారట. ఈ విషయాన్ని అజిత్ కూడా ఒకానొక సందర్భంలో వెల్లడించారు. ప్రస్తుతం అజిత్ ‘వాలిమాయ్’ అనే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. 1998లో వచ్చిన ‘అవల్ వరువల’ అనే సినిమాలో అజిత్, పృథ్వీ కలిసి నటించారు.

Related posts