telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హాట్ లుక్స్ తో చంపేస్తోన్న నటి ప్రగతి !

తల్లి, అత్త పాత్రలను పోషించే సీనియర్ ఆర్టిస్టులు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటున్నారు. అందులో భాగంగానే సీనియర్ నటి ప్రగతికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. తెలుగు, తమిళం, మలయాళం చిత్రాల్లో నటిస్తూ ఆమె మంచి పేరు తెచ్చుకున్నారు. చేతి నిండా ఆఫర్లతో క్షణం తీరిక లేకుండా గడిపే ప్రగతి ఇప్పుడు ఇంటికే పరిమితమయ్యారు. ప్రగతి ఆ మధ్య విజయ్ మాస్టర్ సినిమా సాంగ్ కి లుంగిలో తీన్మార్ స్టెప్పులు వేసి అలరించింది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌గా కూడా మారింది. అయితే.. తాజాగా తన కూతురు బర్త్‌డే సందర్భంగా ప్రగతి దిగిన ఓ సెల్ఫీ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ హల్‌ చల్‌ అవుతోంది. ఇందులో ప్రగతి, తన కూతురు హాట్‌ డ్రెస్సులు వేసుకుని ఉన్నారు. ఆమె కూతరు కూడా ఎంతో అందంగా ఉంది. ఈ హాట్‌లుక్స్‌ పిక్స్‌ ఇప్పుడు తెగ వైరల్‌ అవుతున్నాయి. దీంతో ప్రగతి తన కూతురిని సినిమాల్లోకి త్వరలో తీసుకువస్తుందేమో అని ఫ్యాన్స్‌ అంటున్నారు.

Related posts