telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

డాక్టర్లకు భారీగా ప‌ర్సన‌ల్ ప్రొట‌క్షన్ కిట్స్ అందించిన హీరో

nikil

క‌రోనా మ‌హ‌మ్మారి నివార‌ణ చ‌ర్యల‌కు యంగ్ హీరో నిఖిల్ ముందుకొచ్చారు. క‌రోనాని అరిక‌ట్టేందుకు ముందు వ‌ర‌స‌లో ఉండి ప్రాణాలకు తెగించి పనిచేస్తోన్న డాక్టర్స్‌, మెడిక‌ల్ సిబ్బందికి చేయూత‌గా వారి ర‌క్షణ‌కి ప‌ర్సన‌ల్ ప్రొట‌క్షన్స్ కిట్స్ భారీగా అందించారు. ఈ సంద‌ర్భంగా నిఖిల్ మాట్లాడుతూ.. ‘‘క‌రోనా నివార‌ణ మ‌నంద‌రికీ ఎంత ముఖ్యమో, డాక్టర్లును సైతం ఆ క‌రోనా భారిన ప‌డ‌కుండా, వారికి శ్రమ క‌ల‌గ‌కుండా చూసుకోవ‌డం కూడా అంతే ముఖ్యం. డాక్టర్లతో పాటు మిగిలిన హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారులు, పోలీస్ సిబ్బంది, మున్సిప‌ల్ కార్మికులు, అధికారులు మనంద‌రి కోసం ఎలాంటి ప్రమాదాన్ని లెక్క చేయ‌కుండా క‌ష్టప‌డుతున్నారు. అందుకు నేను కృత‌జ్ఞత‌గా ఈ ప‌ర్సన‌ల్ ప్రొట‌క్షన్ కిట్స్ అందిస్తున్నాను. క‌రోనా నివార‌ణ జ‌ర‌గాలంటే మ‌నంద‌రం ఇంటిలోనే ఉంటూ ఆరోగ్య ప‌ర‌మైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ 21 రోజుల లాక్‌డౌన్‌కి మ‌నంద‌రం స‌హ‌క‌రించాలి’’ అని అన్నారు.

Related posts