తెలుగు, తమిళ భాషలలో పలు చిత్రాలు చేశాడు యంగ్ హీరో నవదీప్. అంతేకాదు అనేక టీవీ షోలకు వ్యాఖ్యాతగా కూడా ఉన్నాడు. 2004లో వచ్చిన “జై” సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన హీరో నవదీప్ ఇప్పుడు కేవలం సపోర్టింగ్ క్యారెక్టర్స్ మాత్రమే చేస్తున్నాడు. ప్రస్తుతం నవదీప్ అల్లు అర్జున్ 19వ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవల ఆయన సిక్స్ ప్యాక్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కొద్ది రోజులుగా గంటలపాటు జిమ్‌లో శ్రమించిన నవదీప్ కండలు తిరిగిన దేహంతో బాలీవుడ్ హీరో లుక్‌లో కన్పించి నెటిజన్లను ఆశ్చర్యపరిచాడు నవదీప్. మరో పక్క బాలీవుడ్‌లో తొలి అవకాశంలోనే హాట్ నటి సన్నీ లియోనీతో కలిసి పని చేయబోతున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏఎల్‌టీ బాలాజీ హిందీలో “రాగిని ఎంఎంఎస్ రిటర్న్స్” అనే వెబ్ సిరీస్‌ను నిర్మిస్తోంది. ఇందులో నవదీప్, సన్నీ లియోనీ కలిసి పనిచేయబోతున్నారు. మరోవైపు తెలుగులో అల్లు అర్జున్ “అల వైకుంఠపురములో” చిత్రంలో ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. అయితే ఆ మధ్య ఈ యంగ్ హ్యాండ్సమ్ హీరో నవదీప్ అమ్మాయిలకంటే అబ్బాయిలకు ఎక్కువ ఎట్రాక్ట్ అవుతారు అని, అతను కొంచెం తేడా అని “గే” అని రూమర్స్ విన్పించాయి. ఇటీవల నవదీప్ ఈ రూమర్స్ పై స్పందిస్తూ ఓ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ సందర్భంగా నవదీప్ మాట్లాడుతూ “నేను యూఎస్‌లో ఉన్నపుడు ఒకరు నాతో చాట్ చేసారు.మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా అన్నాడు. సరే అడగమంటే మీకు అబ్బాయిలంటే బాగా ఇష్టం అంట కదా.. నేనూ అంతేనండి అని అన్నాడు. మీతో చాలా మాట్లాడాలి, నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకోవాలని ఉంది అని అన్నారు. దానికి నేను వెంటనే నాకు ఇంటరెస్ట్ లేదు అని బై చెప్పి దండంపెట్టేశా. అసలు గేలు సినిమాల్లో చూపించినట్లు ఉండరు. కేవలం హాస్యం కోసమే సినిమాలో ఆవిధంగా చూపిస్తారు” అని పేర్కొన్నారు.
previous post
next post