telugu navyamedia
సినిమా వార్తలు

తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదంటూ నాజర్ పై ఆరోపణలు

Nassar

సీనియ‌ర్ న‌టుడు, న‌డిగ‌ర్ సంఘం అధ్య‌క్షుడు నాజ‌ర్‌పై అత‌ని సోద‌రులు జ‌వ‌హర్‌, ఆయుబ్‌ తాజాగా చేసిన ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. త‌ల్లిదండ్రుల‌కు ఆరోగ్యం స‌రిగ్గా లేకుంటే ఆర్థిక సాయం చేయ‌క‌పోగా, క‌నీసం ప‌ల‌క‌రించ‌డానికి కూడా ఆయ‌న రాలేదంటూ వారు పేర్కొన్నారు. ఇది వ‌ర‌కు ఇలానే వీరు చాలా సార్లు నాజ‌ర్‌పై ఆరోప‌ణ‌లు చేశారు. నలుగురు అన్న‌ద‌మ్ముల్లో నాజ‌ర్ పెద్ద‌వాడని, పెళ్లి త‌ర్వాత కుటుంబానికి దూరంగా వెళ్లిపోయాడని, మిగిలిన ముగ్గురిలో చివ‌రి వాడు.. మాన‌సిక వ్యాధితో బాధ‌ప‌డుతున్నాడని, న‌టుడిగా బాగా సంపాదించుకున్న నాజ‌ర్ త‌మ‌కు ఎలాంటి స‌హాయం చేయ‌క‌పోగా, త‌ల్లిదండ్రుల‌కు కూడా స‌హాయం చేయ‌డం లేద‌ని, కనీసం త‌ల్లిదండ్రుల‌ను చూడ‌టానికి కూడా రావ‌డం లేద‌ని వారు తెలిపారు. ఈ విష‌యంలో నాజ‌ర్ స్పందించ‌క‌పోతే అత‌నిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చరించారు. మరి ఈ విషయంపై నాజర్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Related posts