telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సినీ పరిశ్రమలో కరోనా కలకలం..ప్రముఖ నటుడికి పాజిటివ్‌

చైనా నుండి వచ్చిన కరోనా మనదేశాన్ని దాదాపుగా ఏడాది నుండి అతలాకుతలం చేస్తుంది. అయితే ఈ ఏడాది జనవరి నుండి కరోనా కు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా కేసులు మాత్రం తగ్గడం లేదు. అయితే ఇప్పటికే మన దేశంలో చాలా మంది రాజకీయనాయకులకు, సెలబ్రెటీలకు కరోనా సోకింది. ఇక తాజాగా  ప్రముఖ నటుడు మనోజ్ బాజ్ పాయ్ కరోనా బారిన పడ్డాడు. దాంతో వైద్యుల సలహా మేరకు ఆయన హోం క్వారెంటైన్ పాటిస్తున్నట్టు సన్నిహితులు తెలిపారు. ఫిబ్రవరి నుండి మనోజ్ బాజ్ పాయ్ ‘డిస్పాచ్’ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అతనితోపాటు చిత్ర దర్శకుడు కాను బెహెల్ కూ పరీక్షలలో కొవిడ్ పాజిటివ్ వచ్చినట్టు తెలిసింది. క్రైమ్ జర్నలిజం నేపథ్యంలో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా ‘డిస్పాచ్’ మూవీ తెరకెక్కుతోంది. హీరోకు, డైరెక్టర్ కు కరోనా సోకడంతో షూటింగ్ ను నిలిపేశారు. పలు హిందీ చిత్రాలతో బిజీ ఉన్న మనోజ్ బాజ్ పాయ్ కు 2019లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయిన ‘ది ఫ్యామిలీ మేన్’ వెబ్ సీరిస్ మంచి పేరు తెచ్చిపెట్టింది.

Related posts