telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హీరోయిన్ మాల్వి మల్‌హో‌త్రాపై కత్తితో దాడి

Lamvi Malhotra

బాలీవుడ్ నటి మాల్వి మల్‌హో‌త్రాపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. మాల్వి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటన సోమవారం రాత్రి సమయంలో జరిగినట్లు సమాచారం. నిందితుడు ఆమెను కడుపులో నాలుగుసార్లకు పైగా పొడిచి వెళ్లిపోయాడు. ప్రస్తుతానికి నిందితుడు యోగేష్ పరారిలో ఉన్నట్లు సమాచారం. పరిస్థితి విషమించడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అతను 2019 నుంచి తనకు ఫేస్ బుక్ ద్వారా ఫ్రెండ్ రిక్వస్ట్ పెట్టి విసిగిస్తున్నాడని, ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశానని, ఈ సంవత్సరం జనవరీలో పెళ్ళి చేసుకోమని వేదించాడని చెప్పింది మాల్వీ. దాంతో పాటు తనతో ఓ ఆల్బమ్ చేయమని అడిగాడనీ తెలిపింది. సోమవారం రాత్రి కూడా పెళ్ళి గురించే మాట్లాడే సరికి పక్కకు వెళ్లిపోయానని, దాంతో ఒక్కసారిగా తనపై దాడికి దిగాడని చెప్పింది. కాగా “హోటల్ మిలన్” సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుందీ భామ. ఆ సినిమాతో బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్‌ను కూడా సంపాదిచుకుంది.

Related posts