telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బుల్లితెర స్టార్ కుషాల్ పంజాబీ ఆత్మహత్య

Kushal

బుల్లితెర షోలతో పాటు పలు చిత్రాల్లో నటించిన నటుడు కుశాల్‌ పంజాబీ (37) ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబయి బాంద్రా వెస్ట్‌లోని తన నివాసంలో గురువారం రాత్రి 11.10 గంటలకు నైలాన్‌ తాడుతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. ఆంగ్లంలో రాసిన ఒకటిన్నర పేజీల ఆత్మహత్య లేఖను పోలీసులు కనుగొన్నారు. తన చావుకు ఎవరూ కారణం కాదని లేఖలో పేర్కొన్నాడు. తన ఆస్తిని కుటుంబ సభ్యులకు (తల్లిదండ్రులు, కొడుకు) ఏ విధంగా పంచాలో కూడా లేఖలో వివరించాడు.

Related posts