telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రియల్ లైఫ్ లోతానొక అజ్ఞాత ప్రేమికుడిలా ఉండిపోయా : హీరో కార్తికేయ

Karthikeya

‘RX 100’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో కార్తికేయ. ఒక ఇంటర్వ్యూలో కార్తికేయ మాట్లాడుతూ కాలేజ్ లవ్‌స్టోరీ గురించి చెప్పారు. కార్తికేయ హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగారు. ఆయ స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్ ఇక్కడే పూర్తయింది. ఆ తరవాత నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్‌లో బీటెక్ చేశారు. అయితే, హైదరాబాద్‌లో ఇంటర్ చదువుతున్న సమయంలో తన కాలేజీలో చదివే ఒక పంజాబీ అమ్మాయిని కార్తికేయ ఇష్టపడ్డారట. కాలేజీలో ఆ అమ్మాయిని బాగా ఫాలో అయ్యేవారట. ఆ అమ్మాయి బాగా చదివేదని.. తాను మాత్రం యావరేజ్ స్టూడెంట్‌నని చెప్పారు. అయితే, ఆ అమ్మాయికి తన ప్రేమ గురించి చెప్పలేదని, అప్పట్లో ప్రపోజ్ చేసేంత సీన్ కూడా ఉండేది కాదని వెల్లడించారు. తానొక అజ్ఞాత ప్రేమికుడిలా ఉండిపోయానన్నారు. కాలేజ్ అయిపోయి ఆ అమ్మాయి వెళ్లిపోయిందని ఆ అమ్మాయి ఫోన్ నంబర్ తీసుకున్నానని, కానీ కాల్ చేయడానికి ధైర్యం సరిపోలేదన్నారు.

అలాగే, వరంగల్ నిట్‌లో బీటెక్ చేసేటప్పుడు కూడా ఒక అమ్మాయిని ప్రేమించానని కార్తికేయ చెప్పుకొచ్చారు. ఆ అమ్మాయి కూడా తనను ప్రేమించిందని, కానీ బీటెక్ పూర్తయ్యేసరికి తాము విడిపోయామని అన్నారు. ప్రస్తుతం ఆమెకు పెళ్లి కూడా అయిపోయిందని చెప్పారు. ప్రస్తుతానికి లవ్ చేసేటంత టైంలేదని చెప్పాడు. కాగా, ‘RX 100’ సినిమాతో వచ్చిన క్రేజ్‌తో కార్తికేయకు వరుసపెట్టి అవకాశాలు వచ్చాయి. అయితే అవి వెండితెరమీద నిరాశపరచాయి. కిందటేడాది కార్తికేయ హీరోగా ‘హిప్పి’, ‘గుణ 369’, ‘90 ఎంఎల్’ సినిమాలు వచ్చాయి. వీటిలో ఏ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ప్రస్తుతం కార్తికేయ హీరోగా ‘చావుకబురు చల్లగా’ అనే సినిమా రూపొందుతోంది. లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 బ్యానర్‌పై బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

Related posts