telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పెళ్ళి పీటలెక్కబోతున్న టాలీవుడ్ విలన్

Kabir-singh

టాలీవుడ్ లో విలన్ గా రాణిస్తున్న నటుడు కబీర్ సింగ్ త్వరలోనే తాను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి పీటలెక్కనున్నాడు. పాపులర్ పంజాబీ సింగర్ అయిన డాలీ సింధుతో కబీర్ సింగ్ వివాహం జరగనుంది. వీరిద్దరూ గత ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నారట. అంతేగాక గతేడాది నిశ్చితార్ధం కూడా జరిగింది. అయితే ఈ ఏడాది ప్రారంభంలోనే పెళ్లి చేసుకుందాం అనుకున్న కబీర్ – సింధులకు కరోనా షాక్ ఇచ్చింది. కరోనా దెబ్బతో వారి పెళ్లి వాయిదా పడింది. అయితే పరిస్థితులు అనుకూలిస్తే ఈ ఏడాది డిసెంబర్ లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. కరోనా ఎఫెక్ట్ తగ్గితేనే తమ పెళ్ళి ఉంటుందని అంటున్నాడు కబీర్. ముంబైలో పెళ్లి, ఢిల్లీలో రిసెప్షన్ ప్లాన్ చేసినట్టు అతడు పేర్కొన్నాడు. ఇక గోపీచంద్ హీరోగా నటించిన ‘జిల్’ సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన కబీర్, “సుప్రీమ్” సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో కబీర్ హీరోగా ఓ సినిమా కూడా ప్రారంభం అయినట్లు సమాచారం.

Related posts