telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ముందే చెప్పా.. “సైరా” ఎవరు చూస్తారు అని… గిరిబాబు కామెంట్స్

Giribabu

మెగాస్టార్ కలల ప్రాజెక్ట్‌ “సైరా”ను రామ్ చరణ్‌ తేజ్ భారీ బడ్జెట్‌తో నిర్మించి అక్టోబర్ 2న విడుదల చేసిన విషయం తెలిసిందే. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కినప్పటికీ ఆశించిన స్థాయి విజయాన్ని అయితే అందుకోలేకపోయింది. క్లోజింగ్ కలెక్షన్స్‌లో బయ్యర్లకు నష్టాలు వచ్చాయనేది ఇండస్ట్రీ టాక్. ఇదిలాఉంటే.. ఈ చిత్రంపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు సీనియర్ నటుడు గిరిబాబు. “చిరంజీవి నేను కలిసి చాలా సినిమాలు చేశాం. ఇప్పటికీ నా తమ్ముడులాగే బిహేవ్ చేస్తాడు. కనిపిస్తే ఆత్మీయంగా పలకరిస్తాడు. ఇప్పటికీ మా ఇద్దరి మధ్య మంచి ఆత్మీయత ఉంది. ఇటీవలే ఆయన నటించిన ‘సైరా’ కూడా చూశా. అద్భుతమైన సినిమా తీశావ్ అని చెప్పా. కాని.. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తరువాత సినిమా తీశాం కాబట్టి… అది యూత్‌ని కనెక్ట్ కాదు. జనరేషన్ గ్యాప్ వచ్చేసింది.. ఎప్పుడో జరిగింది ఇప్పుడు తీస్తే లాభం ఉండదని చెప్పా. స్వాతంత్ర్యం వచ్చి మూడు జనరేషన్‌లు అయిపోయిపోయింది. ఇప్పుడు స్వాతంత్ర్య పోరాటం, వీరులు అంటే యూత్ చూడరు. అదే పాకిస్థాన్‌పై యుద్ధం అంటే చూస్తారు. ఎందుకంటే అది కరెంట్ సబ్జెక్ట్. క్లబ్‌లు పబ్‌ల కాలం నడుస్తోంది. వాళ్లకు డాన్స్‌లు ఫైట్‌లు కావాలని అంటారు. బాహుబలి లాంటి సినిమా తీస్తే చూస్తారు మళ్లీ.. ఎందుకంటే అది కొత్తగా తీశారు కాబట్టి” అంటూ చెప్పుకొచ్చారు గిరిబాబు.

Related posts