telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘మా’ తాత్కాలిక అధ్యక్షుడిగా నటుడు బెనర్జీ

benarji

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ తాత్కాలిక అధ్యక్షుడిగా నటుడు బెనర్జీని నియమించారు. ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ 41 రోజులు సెలవు పెట్టడంతో డిసిప్లినరీ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ కలిసి నియమనిబంధనల ప్రకారం వైస్ ప్రెసిడెంట్ బెనర్జీని యాక్టివ్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారు. బుధవారం సాయంత్రం ‘మా’ కార్యాలయంలో ఈ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు, మెగా స్టార్ చిరంజీవి, మురళీమోహన్, యాక్టివ్ ప్రెసిడెంట్ బెనర్జీ, జనరల్ సెక్రటరీ జీవిత రాజశేఖర్, హేమ, రాజీవ్ కనకాల, శివ బాలాజీ, అనితా చౌదరి, జయలక్ష్మి, కరాటే కళ్యాణి, ఏడిద శ్రీరామ్, రవి ప్రకాష్ టార్జాన్, పసునూరి శ్రీనివాస్, రాజా రవీంద్ర, ఆలీ, సురేష్ కొండేటి, తనీష్, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts