telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పెళ్ళైనా.. మిమ్మల్ని వదలను అంటున్న .. నటి అంజలి..

actor anjali on her marriage and life

తమిళ సినీ పరిశ్రమకు ‘కట్రదు తమిళ్‌’ చిత్రంతో పరిచయమైన తెలుగమ్మాయి అంజలి. ఈ సినిమా తర్వాత ఆమెకు పలు అవకాశాలు రావడంతో తమిళమ్మాయిగా మారిపోయారు. ఇటీవల ‘తరమణి’, ‘పేరన్బు’ తదితర చిత్రాల్లో నటించారు. సహజమైన పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అంజలికి ఇప్పటికీ తమిళంలో అవకాశాలు వస్తున్నాయి. అయితే ఈ అమ్మడు ఓ తమిళ నటుడిని పెళ్లాడనున్నారని, ఆ తర్వాత సినిమాల్లో నటించరని ఇటీవల వార్తలు వినిపించాయి.

దీనిపై అంజలి స్పందిస్తూ ‘ప్రస్తుతం పెళ్లి చేసుకునే ఆలోచనలో లేను. ఒకవేళ పెళ్లి అయినా.. నటనను మాత్రం కొనసాగిస్తా. పెళ్లి తర్వాత నటనకు దూరమయ్యే అవకాశం లేదు. పెళ్లి తర్వాత పరిశ్రమకు దూరమైన హీరోయిన్లంతా మళ్లీ నటించడానికి వస్తున్నప్పుడు.. నేనెందుకు పెళ్లైన తర్వాత ఇంట్లో కూర్చోవాలి అంటుంది ఈ తెలుగు బొమ్మ.

Related posts