telugu navyamedia
culture news political telugu cinema news

తెలంగాణ ప్రభుత్వంపై నటి అమల ప్రశంసలు!

Actor Amala meets minister IK Reddy

తెలంగాణ ప్రభుత్వంపై సినీనటి, బ్లూ క్రాస్ సంస్థ వ్యవస్థాపకురాలు అక్కినేని అమల ప్రశంసలు కురిపించారు. వన్యప్రాణుల సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అన్నపూర్ణ స్టూడియోలో ఈనెల 8 నుంచి 10 వరకు జరిగే ఇంటర్నేషనల్ వైల్డ్ లైఫ్ ఫిల్మ్ ఫెస్టివల్ కు రావాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని స్వంగా కలిసి అమల ఆహ్వానించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని ఆమె ప్రత్యేకంగా ప్రశంసించారు.

వన్యప్రాణుల పరిరక్షణకు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆమె కొనియాడారు. మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, రాష్ట్రాల నుంచి పెద్దపులులు ఆదిలాబాద్ జిల్లా పరిసర ప్రాంతాల్లోని అడవులకు వలస వస్తున్నాయని వాటి సంరక్షణకు మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.

Related posts

టెండర్లు పిలవకుండా అంతర్వేదిలో రథ నిర్మాణం: లోకేశ్

vimala p

రైతుబంధు పథకాన్ని మోదీ, చంద్రబాబు కాపీ కొట్టారు: : కేటీఆర్‌

vimala p

బీఐఎస్‌లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల

vimala p