telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పవన్ పేరును వాడుకుని సినిమాలను ప్రమోట్ చేసుకునే స్థాయికి నేను దిగజారలేదు… : అడివిశేష్

Adivi-Sesh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సెలబ్రేషన్ 50 రోజులు ముందుగానే ప్రారంభించారు ఆయన అభిమానులు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే పవన్ అంటూ జూలై 13 నుంచే ట్విట్టర్‌లో హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఇదే సందర్భంలో ఆయనపై సెలబ్రిటీలు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. క్షణం, గూఢచారి, ఎవరు వంటి హిట్ చిత్రాలతో విలక్షణ నటుడిగా పేరొందిన అడవి శేష్ గతంలో పవన్ కళ్యాణ్‌పై చేసిన కామెంట్స్ ఆయన అడ్వాన్స్ బర్త్ డే ట్రెండ్‌లో భాగంగా ట్రెండింగ్ అవుతోంది. దర్శకుడిగా, రచయితగా, నటుడిగా మల్టీటాలెంట్‌తో ఆకట్టుకుంటున్న అడవి శేష్.. 2011లో వచ్చిన పవన్ కళ్యాణ్ ‘పంజా’ చిత్రంలో నెగిటివ్ రోల్ చేశారు. ఈ చిత్రం అడవి శేష్‌కి గుర్తింపు తీసుకురావడంతో ఆ తరువాత వరుస చిత్రాల్లో నటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “పంజా చిత్రంలో నెగిటివ్ రోల్ చేయడం ద్వారా జనానికి నేను పరిచయం అయ్యాను. పవర్ స్టార్ ప్లాట్ ఫామ్ దొరకడం అంటే జోక్ కాదు. అదో పెద్ద అవకాశం. విష్ణ వర్ధన్ అనే పెద్ద డైరెక్టర్.. బాహుబలి ప్రొడ్యుసర్స్ ‘ఆర్కా’ మీడియా.. నీలిమా గారు నా టాలెంట్‌ను గుర్తించారు. వాళ్ల వల్లే నాకు ‘పంజా’ అవకాశం వచ్చింది. ఆ తరువాత బాహుబలి ఛాన్స్ వచ్చింది. బాహుబలి సెట్‌లో రాజమౌళి వర్క్ స్టైల్ చూసి.. దాన్ని నేను క్షణం సినిమాకి అప్లై చేశా.. ఇప్పటికీ నేను దాన్ని ఫాలో అవుతున్నాను. 12 సినిమాలు చేసినా కూడా నేను ‘పంజా’ గురించే చెప్తా అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. కాని నా సినిమాలు దేనికదే ప్రత్యేకం. ఇప్పుడు చాలా మంది గూఢచారి గురించి చెప్పుకుంటారు.. ఎవరు గురించి మాట్లాడతారు.. క్షణం సినిమా గురించి చెప్తారు. ఎక్కడ కనిపించినా గూఢచారి అంటారు. అయితే నేను పరిచయం అయ్యింది పంజా చిత్రంతో. ఎన్ని గొప్పసినిమాలు చేసినా.. ఫస్ట్ మూవీ ఫస్ట్ మూవీనే. అయితే పవన్ కళ్యాణ్‌తో పంజా మూవీ చేసినా ఆయన పేరు చెప్పుకుని నా సినిమాలను ప్రమోట్ చేసుకునే స్థాయికి నేను దిగజారలేదు. ‘పంజా’ సినిమా అప్పుడు తప్పితే పవన్ కళ్యాణ్‌తో మాట్లాడింది లేదు.. కలిసింది లేదు. మిమ్మల్ని కలుస్తా సార్ అని పవన్ సార్ నంబర్ తీసుకున్నా.. కాని పంజా తరువాత ఆయన్ని కలవలేదు, మాట్లాడలేదు. ఆయన కూడా నాకు ఫోన్ చేయలేదు. నేను ఎప్పుడూ ఒకర్ని వాడుకుని నా సినిమాని ప్రమోట్ చేసుకోవాలనే స్థాయికి పడిపోలేదు. నాకు ఆ ఉద్దేశం లేదు. జనం ఏదో అనుకుంటున్నారని నేను నా ఉద్దేశం మార్చుకోను. గతంలో అలా ఆలోచించే దెబ్బైపోయా. సినిమా తీసి నష్టపోయా. జనం కోసం కాదు.. నా కోసం ఆలోచించాలని డిసైట్ అయ్యా.. నా మనసుకి నచ్చింది మాత్రమే చేస్తా.. నా గోల్ నా హార్ట్. అది చెప్పినట్టే వెళ్తున్నా.. దేవుడి దయతో సక్సెస్‌లు చూస్తున్నా” అంటూ చెప్పుకొచ్చారు అడవి శేష్.

Related posts