telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

దసరా మాములు తీసుకున్నందుకు .. వాలంటీర్ల తొలగింపు..

AP

దేశంలోనే తొలిసారిగా గ్రామ వాలంటీర్ వ్యవస్థను సీఎం జగన్ ప్రభుత్వం నెలకొల్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏపీలో ప్రతీ 50 కుటుంబాలకు ఒక గ్రామ వలంటీర్ సేవలంధిస్తున్నాడు. కులాలు, మతాలు, రాజకీయాలు, పార్టీలు చూడకుండా..అర్హులైన అందరికి సంక్షేమాన్ని అందించాలని..ఇటీవలే గ్రామ వాలంటీర్లకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. పనిలో అలసత్వం, అవినీతి ఆరోపణలు వస్తే వెంటనే ఉద్యోగాలలో నుంచి తీసేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చారు. వాలంటీర్లు తప్పు చేస్తే ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేయాలని ప్రజలకు స్వయంగా సీఎం జగన్ పిలుపునిచ్చి ఒక టోల్ ఫ్రీ నంబర్ ను కేటాయించారు.

కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం రుద్రవరం గ్రామానికి చెందిన వాలంటీర్లు చుక్కా విజయవర్మ, లంకపల్లి ఒలివ, గాడెల్లి సునీల్ కుమార్, తెనాలి వనజలు ఈ నెల 1వ తేదీన పెన్షన్ల పంపిణీ సమయంలో ఒకొక్కరి నుంచి రూ.50/-లు దసరా మాముళ్ళుగా వసూలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై అధికారులు విచారణకు ఆదేశించగా వసూళ్ళకు పాల్పడినట్టు గ్రామ కార్యదర్శి నివేదిక ఇచ్చారు. కార్యదర్శి నివేదిక, GO.NO.104, గ్రామ వలంటీర్ల నియామక ఉత్తర్వులలో పేర్కొన్న విధంగా అవినీతికి పాల్పడిన సదరు నలుగురు వాలంటీర్లను విధుల నుంచి తొలగిస్తూ మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా తొలి దశలోనే వేటు వేస్తే.. మిగతావారికి భయం ఉంటుంది. ఏది ఏమైనా.. గ్రామ సచివాలయ వ్యవస్థను గాడినపెట్టేందుకు జగన్ సర్కారు కఠినంగా ముందుకెళుతోంది.

Related posts