telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నోటీసులు ఇవ్వాల్సిన పనిలేకుండా.. అక్రమకట్టడాలు కూల్చేసే చట్టం..

act for no notice on collapse illegal buildings

అక్రమ కట్టడాలపై తెలుగు రాష్ట్రాలలో పోరు మరో మెట్టు .. ఇక నుండి నోటీసులు ఇవ్వకుండానే అక్రమ కట్టడాల కూల్చివేతకు వీలు కల్పించేలా కొత్త చట్టం తెస్తున్నామని తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించారు. అక్రమ కట్టడాలను తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోదని కేసీఆర్ స్పష్టం చేశారు. ఆగస్టు 15 నుంచి పరిపాలన అంటే ఏంటో చూపిస్తామని ఆవేశంగా చెప్పారు. యావత్ దేశం తెలంగాణను చూసి నేర్చుకునేలా పాలన సంస్కరణలు తీసుకువస్తామని అన్నారు.

ప్రజాదర్బార్ నిర్వహించి రాష్ట్రంలో ఉన్న పోడు భూముల సమస్యలు సత్వరమే పరిష్కరిస్తామని, పట్టణాలు, గ్రామాల్లో గ్రీన్ కవర్ పాలసీ అమలు చేస్తామని సీఎం కేసీఆర్ వివరించారు. ఇక, గ్రామాల్లో మొక్కల పెంపకాన్ని నిర్లక్ష్యం చేస్తే సర్పంచులు పదవులు పోగొట్టుకోవాల్సి ఉంటుందంటూ హెచ్చరించారు. అంతేగాకుండా, 85 శాతం మొక్కలు బతికితేనే పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేస్తామంటూ షరతు విధించారు. మున్సిపల్ వార్డుల్లో అయితే కౌన్సిలర్, ఇన్ చార్జి ఆఫీసర్ కు మొక్కల పెంపకం బాధ్యత అప్పగిస్తున్నట్టు చెప్పారు. పబ్లిక్ టాయిలెట్స్ విధానానికి మున్సిపల్ చట్టంలో అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు కేసీఆర్ తెలిపారు.

Related posts