telugu navyamedia
తెలుగు కవిత్వం సామాజిక

అచ్చుల్లో “ఆమె”  అనురాగం

prema khaidi poetry corner
*అ* నురాగం- *అ* నుబంధం 
*ఆ* త్మీయత- *ఆ* ప్యాయత
ఆమె వాణి లో విన్నాను –
*ఇ* ష్టం – *ఈ* ప్సితం
*ఇ* నుమడించడం- *ఈ*!ర్ష లేనితనం-
ఆమెలో కనుగొన్నాను-
*ఉ* రకలు వేయడం – *ఊ* హల్లో ఊరేగడం-
*ఉ* దధి ఉనికిలో- *ఊ* ర్మి కావడం-
ఆమెలో చూశాను-
*ఋ* క్షమై మెరవడం –
*ఋ* జుమార్గం కావడం-
ఆమెవర్తనలో కనుగొన్నాను-
*ఎ* వరికైనా – *ఏ* దైనా_ *ఐ* తే-
*ఎ* రిగి మరీ- *ఏ* మిటంటూ- 
స్నేహం పంచి’_ *ఐ* క్యత కోరడం
ఆమెలో చూశాను-
*ఒ* దిగి  – *ఓ* రిమితో – *ఔ* న్నత్యమే – తానై-
ప్రభవించడం- తెలుసుకున్నాను-
ఆమె ప్రేమలో పడ్డాను-
ఆమెలో ఉన్నతికి ముచ్చటపడ్డాను
*అం* దుకే   – *అః*! అంటూ-
ఆహా ! అనురాగంలో విహరిస్తూ,
అవ్యాజమైన ప్రేమతో
 ఆమె కావాలని కోరుకున్నాను-
మా ప్రేమ సామ్రాజ్యానికి
 మహారాణి గా పట్టాభిషేకం  చేశాను-
మహేంద్రాడ సింహాచలాచార్య –
టెక్కలి ( శ్రీకాకుళం జిల్లా)

Related posts