telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఆచార్య టీజర్‌ వచ్చేది ఎప్పుడో తెలుసా…?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా “ఆచార్య” చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ చిత్రాన్ని సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై రామ్ చరణ్, నిరంజన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. మెసేజ్ ఓరియంటెడ్ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కినట్లుగా ఈ మోషన్ పోస్టర్ చూస్తుంటే తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సమ్మర్ 2021కి విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ మోషన్ పోస్టర్‌లో ప్రకటించింది.  అయితే ప్రస్తుతం మెగా అభిమానులు ఎదురుచూస్తున్న ఏకైక విషయం ఆచార్య టీజర్. ఈ సినిమా టీజర్ విడుదల ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఉవ్విళూరుతున్నారు. అయితే ఎట్టకేలకు దీనిపై ఓ తాజా అప్‌డేట్ వచ్చేసింది. జనవరి 29 న సాయంత్రం 4:05 నిమిషాలకు ధర్మస్థలి డోర్ ఓపెన్ కాబోతుందంటూ  కొరటాల ట్విట్టర్ ద్వారా ఓ వీడియోతో షేర్ చేశారు. ఇంతవరకు పోస్టర్ తప్ప, వేరే ఏ అప్డేట్ ‘ఆచార్య’ నుంచి లేకపోవడంతో ఈ టీజర్ గురించి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. చూడాలి మరి టీజర్ ఎలా ఉంటుంది అనేది.

Related posts