telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కొరటాలకు వార్నింగ్‌ ఇచ్చిన మెగాస్టార్‌ !

దర్శకుడు కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తో పాటుగా మెగాపవర్ స్టార్ రాంచరణ్ కూడా కీలక పాత్రలో చేస్తున్నాడు. దాదాపు రాంచరణ్ 40నిమిషాల నిడివి ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో మెగాస్టార్ చిరంజీవికి కాజల్ అగర్వాల్ కథానాయికగా చేస్తోంది. అయితే కాజల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే విషయం తెలిసిందే.  అయితే.. ఈ సినిమా నుంచి రిపబ్లిక్ డే కైనా… ఏదో ఒక అప్ డేట్ వస్తుందని అభిమానులు భావించారు. కానీ వారి ఆశలు నిరాశకు గురయ్యాయి. నిజానికి ఇదే అసహనం చిరంజీవికి కూడా కలుగుతున్నదనిపిస్తోంది. దర్శకుడు కొరటాల శివతో సీరియస్ డిస్కషన్ జరిగిందని, దానికి సంబంధించిన అప్ డేట్ ను సాయంత్రం 6.30కి ఇస్తానని చిరంజీవి సోషల్ మీడియా ద్వారా చెప్పగానే… అభిమానులంతా గంపెడు ఆశలు పెట్టుకున్నారు… తీరా చూస్తే… చిరంజీవి తనలోని అసహనాన్ని మీమ్స్ రూపంలో వెల్లడించారు. ‘ఆచార్య’ టీజర్ గురించి తనకు… కొరటాల శివకు మధ్య జరిగిన సంభాషణను సరదాగా మార్చి… మీమ్స్ గా చేసి 6.30కి ఓ పోస్ట్ పెట్టారు. ఏతా వాతా తేలిందేమంటే… బుధవారం ఉదయం 10.00కి టీజర్ రిలీజ్ కు సంబంధించిన ప్రకటనను కొరటాల శివ ఇస్తానని హామీ ఇచ్చినట్టు తెలిపారు.

Related posts