telugu navyamedia
ట్రెండింగ్ సామాజిక

డ్రైనేజిలో .. పెళ్లి.. !!

Ready to 2nd marriage arrested jagityal

భారతీయ పెళ్లి వేడుకలంటేనే ఆ సరదా, సందడి, హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. అందులో కాస్త అటుఇటు అయితే సరదా కాస్త విషాదం అయికూర్చుంటుంది. ఇవేం మాటలు, చక్కగా శుభం పలికారా పెళ్ళికొడకా.. అంటే.. ఏదో అన్నట్టుగా ఉందా.. ఇక్కడ అదే జరిగింది చూడండి.. పెళ్లి వేడుకలో వరుడి తరపు స్నేహితులు, బంధువులు ఉత్సాహంగా చిందులేశారు. అయితే, బీభత్సంగా చేసిన ఈ డ్యాన్స్ వికటించింది. వారి స్టెప్పులకు తట్టుకోలేని చిన్నపాటి ఆ బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలింది. అంతే, పెళ్లికొడుకు డ్రైనేజీలో పడిపోయాడు. నోయిడాలోని హోషియార్‌పూర్‌లో జరిగిందీ ఘటన.

నిజానికి పెళ్లి కోసం బుక్ చేసిన మండపానికి, రోడ్డుకు మధ్య మురుగు కాలువ ఉంది. దానిపై చిన్నపాటి బ్రిడ్జిని ఫంక్షన్ హాల్ యజమాని తాత్కాలికంగా ఏర్పాటు చేశాడు. పెళ్లి కొడుకుని ఆహ్వానించేందుకు బ్రిడ్జికి ఆ వైపున వధువు తరపు బంధువులు వేచి చూస్తున్నారు. వరుడిని బాజాభజంత్రీలతో పెళ్లి మండపానికి అట్టహాసంగా తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పెళ్లికొడుకు తరపు స్నేహితులు చేసిన డ్యాన్స్‌కు తట్టుకోలేని ఆ బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలింది. దీనితో వరుడు సహా 15 మంది మురికి కాల్వలో పడిపోయారు. ఇందులో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. దీనితో అప్పటి వరకు ఆనందంగా సాగిన పెళ్లి వేడుక కాస్తా విషాదంగా మారిపోయింది.

ఈ ఘటనలో వరుడు, మరో 15 మంది స్వల్పంగా గాయపడ్డారు. పెళ్లికొడుకు ధరించిన బంగారు నగలు కాల్వలో పడిపోయాయి. అయితే, ఎవరికీ ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బ్రిడ్జి కూలిన ఘటనపై ఫంక్షన్ హాల్ యజమానితో పెళ్లికొడుకు బంధువులు గొడవకు దిగారు. చివరికి విషయం పోలీసుల వరకు వెళ్లింది. దీనితో ఫంక్షన్ హాల్ బుకింగ్ కోసం చెల్లించిన రూ. 3 లక్షలను తిరిగి ఇచ్చేందుకు దాని యజమాని అంగీకరించాడు. అనంతరం మళ్లీ తయారైన పెళ్లికొడుకు పెళ్లిపీటలపై కూర్చోవడంతో పెళ్లి జరిగింది.

Related posts