telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

అచ్చెన్నను మూడో రోజు విచారించిన ఏసీబీ

Tdp Achennaaidu

గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నటీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని మూడో రోజు కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఈ మూడ్రోజుల్లో మొత్తం పదిన్నర గంటల పాటు ఏసీబీ విచారణ సాగింది. ఈఎస్ఐ మందుల కొనుగోళ్లు, టెలీహెల్త్ సేవలకు సంబంధించి సిఫారసు లేఖపై అచ్చెన్న సంతకం చేయడంపైనా ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది.

ఈ సందర్భంగా అచ్చెన్న జవాబులతో అసంతృప్తికి గురైన అధికారులు ఆయన మనసు విప్పి జవాబు చెప్పడం లేదని ఏసీబీ భావించినట్టు సమాచారం. అధికారులు అడిగిన ప్రశ్నలకు అచ్చెన్న బదులిస్తూ, కొనుగోళ్ల సమయానికి తాను మంత్రిగా లేనని తెలీపినట్టు తెలుస్తోంది. తెలంగాణ మాదిరి వాటి అమలుపై అధ్యయనానికి సూచించానని తెలిపారు. మినిట్స్ పై సంతకం చేశాను తప్ప కొనుగోలు ఫైలు తన వద్దకు రాలేదని చెప్పినట్టు వెల్లడైంది.

Related posts