telugu navyamedia
ఆరోగ్యం

గర్భనిరోధక మాత్రలతో బరువు పెరుగుతారా?

Why boys are interested in sleeping after sex?

గర్భనిరోధక మాత్రలు తీసుకుంటే బరువు పెరుగుతారనే విషయంలో కొంతవరకు నిజముంది. దీర్ఘకాలంగా ఈ గర్భనిరోధక మాత్రలు తీసుకునే స్త్రీలు కొంత వరకు బరువు పెరగొచ్చు. ఎందుకంటే ఈ మాత్రలలో ఉండే హార్మోన్లు ఒంట్లో నీటిని కాస్త ఎక్కువ నిల్వ ఉండేలా చేస్తాయి. అంతకు మించి బరువు పెరగటానికి ఇతరత్రా కారణాలేవీ లేవు. అయితే గర్భనిరోధక మాత్రలు మానేసిన తరువాత రెండు నెలలకు స్త్రీలు సాధారణ బరువుకు చేరుకుంటారు. కాబట్టి గర్భనిరోధక మాత్రలు వాడడం వలన పెరిగే బరువు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే ఎక్కువ కాలం పాటు కుటుంబ నియంత్రణ పాటించాలని అనుకుంటే కాపర్‌టీ వంటి తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించడం మరింత సురక్షితం. ఎలాంటి కుటుంబనియంత్రణ విధానాన్ని అనుసరించినప్పటికీ తప్పనిసరిగా 6 నెలలకు ఒకసారి డాక్టర్‌ను సంప్రదించడం ఇంకా మంచిది. 

Related posts