telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మీడియా ప్రతినిధులకు నిరాశ.. భారత్ లో అభినందన్ మౌనం!

Abinandan silence to media journalists

పాకిస్థాన్ ఆర్మీ చేతికి చిక్కిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ఎట్టకేలకు భారత్ చేరుకున్నాడు. అభినందన్‌ క్షేమంగా తిరిగి భారత్‌కు తిరిగి రావాలని యావత్‌ భరత ఖండం వేయి కళ్లతో ఎదురు చూసింది. జెనీవా ఒప్పందం ప్రకారం పాక్‌ మన వింగ్‌ కమాండర్‌ శుక్రవారం రాత్రి 9:21 నిముషాలకు వాఘా సరిహద్దు వద్ద అప్పగించింది. భారత్, పాక్ అధికారులు పరస్పరం పత్రాలు మార్చుకున్న అనంతరం అభినందన్ స్వదేశంలో అడుడుపెట్టాడు. అభినందన్ మాట్లాడుతాదని గంటల తరబడి ఎదిరిచూసిన మీడియా ప్రతినిధులకు తీవ్ర నిరాశ మిగిలింది.

పాక్ సైన్యం అభినందన్ ను తీసుకువచ్చి భారత వాయుసేన ఉన్నతాధికారులకు అప్పగించగా, అభినందన్ ఆ అధికారులతో కలిసి ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్లిపోయాడు. అభినందన్ ను చూడగానే భావోద్వేగానికి గురైన ఎయిర్ ఫోర్స్ అధికారులు అతడిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని వాహనం వరకు తోడ్కొని వెళ్లారు. తొలుత అమృత్ సర్ లో ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి, అనంతరం ఢిల్లీ తీసుకెళ్లి అక్కడ మరిన్ని వైద్యపరీక్షలు నిర్వహించాని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Related posts