telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ట్రోలర్ కు అభిషేక్ బచ్చన్ కౌంటర్…!

Abhishek

సోషల్ మీడియా వచ్చాక తమ అభిమాన నటులను చేరుకోవడం అభిమానులకు సులభమైంది. అలాగే నెటిజన్లు కొన్నిసార్లు కొంతమంది సెలెబ్రిటీలను తమ ప్రశ్నలతో ఇరుకున పెట్టడానికి. ఇబ్బంది పెట్టడానికి కూడా ట్రై చేస్తుంటారు. సోషల్ మీడియా వేదికగా ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ హుందాగా స్పందించాడు. చాలా డీసెంట్‌గా కౌంటర్ ఇచ్చాడు. తాజాగా అభిషేక్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ సందేశాన్ని పోస్ట్ చేశాడు. `జీవితానికి ఒక లక్ష్యం నిర్దేశించుకోండి. అసాధ్యమైన పనిని సాధించి.. అది అసాధ్యమైనది కాదని ఈ ప్రపంచానికి తెలియజేయండి` అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీనికి రిప్లైగా ఓ నెటిజన్.. `సోమవారం కూడా సంతోషంగా విశ్రాంతి తీసుకునే వ్యక్తిని ఏమంటాం?.. నిరుద్యోగి` అని కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌కు అభిషేక్ స్పందిస్తూ… “మీ అభిప్రాయంతో ఏకీభవించడం లేదు. కొందరు ఏ పని చేసినా దానిని చాలా ఇష్టంగా ప్రేమతో చేస్తారు” అని సమాధానం ఇచ్చాడు. నెటిజన్ కామెంట్‌కు అభిషేక్ హుందాగా స్పందించిన తీరు అందర్నీ ఆకట్టుకుంటోంది.

Related posts