telugu navyamedia
సినిమా వార్తలు

ఆసక్తికరంగా “అభినేతి-2” తెలుగు టీజర్

Devi-2

గత కొంతకాలం క్రితం ప్రభుదేవా, తమన్నా ప్రధాన పాత్రల్లో విజయ్ దర్శకత్వంలో “దేవి” సినిమా తెరకెక్కింది. హార్రర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం తెలుగులో “అభినేత్రి” పేరుతో విడుదలైంది. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లతో మంచి హిట్ ను అందుకుంది. దాంతో దర్శకుడు ఎ.ఎల్. విజయ్ ఈ సినిమాకి సీక్వెల్ చేశాడు. ‘అభినేత్రి 2’ పేరుతో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రం నుంచి తాజాగా తెలుగు టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్లో ప్రభుదేవా, తమన్నా, నందితాశ్వేత, కోవై సరళలపై కొన్ని సన్నివేశాలను చూపించారు. సస్పెన్స్ హార్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.మే 31వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మీరు కూడా ఈ టీజర్ ను వీక్షించండి మరి.

Related posts