telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పాక్ మ్యూజియం లో .. అభినందన్ విగ్రహం.. ఇదేమి వ్యూహమో..

abhinandan statue in pak musium

పుల్వామా బాంబు దాడి అందరికి తెలిసిందే. దానికి ప్రతీకారంగా భారత్ సర్జికల్ స్ట్రైక్ కూడా తెలిసిందే. అయితే ఈ ఆపరేషన్ లో అభినందన్ పాక్ చేతులలో చిక్కడం, అతడిని మళ్ళీ భారత్ కి రప్పించడం జరిగింది. ఈ ఘటన ఇప్పటిలో ఎవరు మరవలేనిది. ఇప్పుడు ఈ విషయం తలుచుకోవడంలో విశేషం ఏమంటే, ఒక ఆశ్చర్యకరమైన ఘటన జరగటమే. అదేమంటే పాక్ మ్యూజియం లో అభినందన్ విగ్రహం ఉండటం.

కరాచీలోని వైమానిక దళ స్థావర మ్యూజియంలో అభినందన్ విగ్రహాన్ని ఎందుకు పెట్టిందో ఇప్పటికి తెలియడం లేదు. అతని విగ్రహంతో పాటు అతను వేసుకున్న దుస్తులను పోలిన దుస్తులను కూడా మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టింది. అతను అక్కడ ఉన్నప్పుడు తాగిన టీ కప్పును కూడా మ్యూజియంలో పెట్టింది. ఇండియాకు చెందిన సైనికుడిని పట్టుకున్నామని భవిష్యత్తులో చెప్పుకోవడానికి అలా చేసిందో లేదంటే.. రహస్యాలను పట్టుకోవడానికి వింగ్ కమాండర్ ను ప్రశ్నించగా.. అయన ఎలాంటి సమాధానం చెప్పకుండా ధైర్యంగా ఉన్నందుకు.. ఆ ధైర్యానికి మెచ్చుకొని అలా పెట్టిందో తెలియదు. మొత్తానికి దీనివెనుక కూడా దయాదిదేశం ఏదో వ్యూహం ఉండే ఉంటుంది.

Related posts