telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“దర్శకుడితో పడుకున్నాను…” హీరో దారుణమైన పోస్ట్ వైరల్

Abhay-Deol

ప్రముఖ బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పోస్ట్ విపరీతంగా వైరల్ అవుతోంది. ఆయన ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఈ వెబ్‌సిరీస్‌ను ‘అదుర్స్’ సినిమాలో విలన్‌గా నటించిన మహేష్ మంజ్రేకర్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సెట్‌లో మహేష్, అభయ్ డియోల్ కుర్చీలో హాయిగా నిద్రపోతున్నప్పుడు ఎవరో ఫొటో తీశారు. ఈ ఫొటోను మహేష్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అయితే దీనికి పెట్టిన క్యాప్షన్ చదివి అందరూ నోరెళ్లబెడుతున్నారు. “మొత్తానికి నేను సాధించాను. నా డైరెక్టర్‌తో పడుకున్నాను” అని పేర్కొన్నారు. ఆయన ఇంగ్లీష్‌లో పెట్టిన ఒరిజినల్ క్యాప్షన్ ఏంటంటే… ‘i slept with my director’. ఇంగ్లీష్‌లో ఆ పదం వినడానికి చాలా అసహ్యంగా ఉంటుంది. నిజానికి అభయ్ పెట్టిన ట్వీట్‌కి అసలైన అర్థం ‘నేను డైరెక్టర్‌తో సెక్స్ చేశాను’ అని. ఈ పదానికి రెండు అర్థాలు ఉండడంతో నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు కూడా అభయ్ పెట్టిన పోస్ట్‌పై స్పందించారు. కొందరు నెటిజన్లైతే దారుణంగా కామెంట్స్ చేశారు.

 

View this post on Instagram

 

I finally did it. I slept with my director. On set with Mahesh Manjrekar. I’m a @hotstar.

A post shared by Abhay Deol (@abhaydeol) on

Related posts