సినిమా వార్తలు

అల్లు శిరీష్ “ఏబీసీడీ” విడుదలకు ముహూర్తం ఫిక్స్

ABCD

అల్లు శిరీష్ నటించిన “ఒక్క క్షణం” సినిమా మంచి హిట్ సాధించింది. 2017 డిసెంబర్ లో ఈ చిత్రం విడుదలై విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. అయితే ఆ సినిమా విడుదలై సంవత్సరం కావస్తున్నా అల్లు శిరీష్ ఇంతవరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. అయితే తాజాగా సంజీవ్ అనే కొత్త దర్శకుడితో కలిసి ఆయన ‘ఏబీసీడీ’ అనే సినిమా చేస్తున్నాడు. దుల్కర్ సల్మాన్ మలయాళంలో చేసిన సినిమాకి ఇది రీమేక్ గా తెరకెక్కుతోంది. రుక్సర్ థిల్లాన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, హీరో స్నేహితుడిగా భరత్ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. ‘మాస్టర్ భరత్’ గా ఈ కుర్రాడు చాలా సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ లోగోను విడుదల చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో అల్లు శిరీష్ వున్నాడు. మరి ఆయన నమ్మకం ఎంత వరకు నిలబడుతుందో చూడాలి.

Related posts

గాయత్రిలో విష్ణు లుక్ చూశారా..?

admin

తార – తీరు

admin

దీపికతో నటించడానికి కోహ్లీ "నో"…!

admin

Leave a Comment