telugu navyamedia
andhra news political trending

చంద్రబాబుకు రాజీనామా సవాల్‌ విసిరిన వైసీపీ ఎమ్మెల్యే

chandrababu tdp

టీడీపీ అధినేత చంద్రబాబుపై దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని.. తన స్వగ్రామం కొండలరావు పాలెంలో వైసీపీ అభ్యర్థి 900 ఓట్ల మెజారిటీతో గెలిస్తే తెలుగుదేశం పార్టీ విజయం సాధించిందని చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చెప్పింది నిజమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అబద్ధమైతే చంద్రబాబు రాజీనామా చేస్తారా ? వాస్తవాలు తెలుసుకుని చంద్రబాబు మాట్లాడాలని హెచ్చరించారు. 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడటం సిగ్గుచేటని.. దెందులూరు నియోజకవర్గంలో 81 శాతం పైగా వైసీపీ మద్దతుదారులు విజయం సాధించారని తెలిపారు. దెందులూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి అడ్డా కాదు…ఇది వైసీపీ గడ్డ అని ప్రజలు ఈ ఎన్నికలతో మరొసారి నిరూపించారని స్పష్టం చేశారు. ఈ నియోజకవర్గంలో 85 పంచాయతీలకు గాను 68 మంది వై.సి.పి సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించారని.. గత ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే ఇప్పుడు పదివేలకు పైగా ఈ నియోజకవర్గంలో ఓట్లు సాధించామని తెలిపారు. 25 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటలుగా ఉన్న గ్రామాలను సైతం బద్దలు కొట్టామన్నారు.

Related posts

రాజధానిని తరలించే శక్తి ఎవరికీ లేదు: అశోక్ గజపతిరాజు

vimala p

జయరాం హత్య కేసు హైదరాబాద్‌కు బదిలీ

ashok

దుష్ప్రచారాలు చేస్తే మర్యాద దక్కదు.. టీడీపీ నేతలకు పవన్ వార్నింగ్ 

ashok