telugu navyamedia
సినిమా వార్తలు

కామెడీ థ్రిల్లర్ చిత్రంలో సల్మాన్ బావ

Aayush-Sharma

“ల‌వ్ యాత్రి” చిత్రంతో బాలీవుడ్ తెర‌కి ప‌రిచ‌యం అయ్యాడు స‌ల్మాన్ చెల్లెలి భ‌ర్త ఆయుష్ శ‌ర్మ. ప్ర‌స్తుతం అయన “క్వ‌త” అనే యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇందులో ఆయుష్ ఆర్మీ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఆయుష్ తాజాగా మ‌రో ప్రాజెక్ట్‌లో న‌టించేందుకు సిద్ధ‌మ‌య్యాడు. భూషణ్ కుమార్‌, కృషణ్ కుమార్, అహ్మ‌ద్ ఖాన్, షైరా ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్‌లో నిర్మితం అవుతున్న కామెడీ థ్రిల్ల‌ర్‌లో న‌టించ‌బోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించి త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంది. తొలి సారి కామెడీ థ్రిల్ల‌ర్‌లో ఆయుష్ నటించనుండడం విశేషం.

Related posts