telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

రాజధానిలో.. కాంగ్రెస్ తో నడవనున్న కేజ్రీవాల్ .. బలవంతపు పెళ్లట..

aap president on alliance with congress

జాతీయంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి, రాబోయే ఎన్నికలలో బీజేపీని గద్దె దించాలని నిర్ణయంతో మహాకూటమి ఏర్పాటు చేసింది కాంగ్రెస్. దానితో ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లాల్సివస్తుంది అంటూ, బలవంతపు పెళ్ళికి సిద్దమైనట్టుగా.. చెపుతున్నాడు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా దేశం గురించి తమకు చాలా ఆందోళనగా ఉందని, అందుకే, వచ్చే ఎన్నికల్లో పొత్తు గురించి తాము ఆలోచిస్తున్నామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీతో ఆప్ పొత్తు గురించి ప్రశ్నించగా, తమతో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని స్పష్టం చేశారు.

ఈ సంద్భంగా ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించి కేజ్రీవాల్ ప్రస్తావించారు. తమ పార్టీ 67 స్థానాల్లో విజయం సాధించినప్పటికీ అధికారాలు మాత్రం తమకు లేవని, మూడు స్థానాల్లో గెలుపొందిన వారికి అధికారాలు ఉన్నాయని విమర్శించారు. ఇది ఏ విధమైన ప్రజాస్వామ్యం?ఢిల్లీ ప్రభుత్వానికి ఎందుకు అధికారాలు లేవు? అని ప్రశ్నించారు. ఢిల్లీకి అన్యాయం జరుగుతోందని, ప్రభుత్వానికి అధికారులను బదిలీ చేసే అవకాశం కూడా లేకపోతే పరిపాలన ఎలా చేయాలని ప్రశ్నించారు. ప్రశాంతంగా సాగుతున్న ఢిల్లీ ప్రభుత్వ పాలనకు కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు.

Related posts