telugu navyamedia
సినిమా వార్తలు

ఆణి ముత్యాలు..

gaddi puvvu poetry corner
పవిత్రమైన పలుకు
ప్రేమామృతములొలుకు
మదిని తొలకరి చినుకు
ఓ వెన్నెలమ్మ!
విడిచిపెట్టుము కుళ్లు
హాని చేసే ముళ్ళు
పాడు చేయును ఒళ్ళు
ఓ వెన్నెలమ్మ!
కల్లలాడుట తప్పు
జీవితానికి ముప్పు
నిజము నిత్యము మెప్పు
ఓ వెన్నెలమ్మ!
ఆడి తప్పిన మాట
పిరికి పందుల బాట
ఎండిపోయిన తోట
ఓ వెన్నెలమ్మ!
-గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు

Related posts