telugu navyamedia
culture news telugu cinema news

కరోనా వైరస్ తనను ఎంతో కలచివేసింది: హీరో అమీర్ ఖాన్

Aamir Khan actor

చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో రోజు రోజు కు ఆ దేశంలో మరణాల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ స్పందించారు.  కరోనా వైరస్ నానాటికీ వ్యాపిస్తుండడం తనను ఎంతో కలచివేసిందని తెలిపారు. చైనాలో వాస్తవ పరిస్థితులను తన స్నేహితుల ద్వారా తెలుసుకున్నానని, బాధతో గుండెలు బరువెక్కాయని అన్నారు. అయినవారిని కోల్పోయిన చైనా ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని అమీర్ ఖాన్ ఓ వీడియో సందేశం వెలువరించారు. చైనా త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.

వైరస్ సోకకుండా అప్రమత్తంగా ఉంటూ, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరమని సూచించారు. చైనాలో ప్రస్తుతం ఎంతో క్లిష్ట పరిస్థితులు నెలకొన్నా, మళ్లీ సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందని తెలిపారు. అమీర్ ఖాన్ నటించిన చిత్రాలు చైనాలో కూడా విడుదల అవుతాయి. ఆయనకు చైనాలో కూడా భారీగా అభిమానులు ఉన్నారు.

Related posts

రాజ్ దూత్ : “మనసున మనసున…” లిరికల్ వీడియో

vimala p

మోటో జి8 ప్లస్ .. వచ్చేసింది.. అందుబాటు ధరలు, పండుగ ఆఫర్లు..

vimala p

“పీఎం నరేంద్ర మోదీ” కొత్త ట్రైలర్

vimala p