telugu navyamedia
telugu cinema news trending

ద్వితీయార్థం మొత్తం “ఆమె” నగ్నంగానే….!?

Aame

రత్నకుమార్ దర్శకత్వంలో అమలాపాల్ హీరోయిన్ గా రూపొందించిన చిత్రం “ఆమె”. తమిళంలో “ఆడై” టైటిల్ తో చిత్రాన్ని విడుదల చేశారు. ఈ సినిమాను వీ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తుండగా చరిత చిత్ర, తమ్మారెడ్డి భరద్వాజలు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా టీజర్లో నగ్నంగా కన్పించి అందరికీ షాకిచ్చింది అమలాపాల్. ప్రముఖులు సైతం సినిమా టీజర్ పై ప్రశంసలు కురిపించారు. టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్ రాబట్టింది. ఇటీవలే ఈ సినిమా తెలుగు ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇందులో అమలాపాల్ మందు తాగుతూ, సిగరెట్ కాలుస్తూ లిప్ లాక్ చేస్తూ చాలా బోల్డ్ గా కనిపించింది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తుంది. “ఆమె” సినిమాకు మంచి టాక్ వ‌చ్చింది. తెలుగులో ఏమో కానీ త‌మిళ‌నాట మాత్రం ఈ చిత్రానికి మంచి వ‌సూళ్లు కూడా వ‌స్తున్నాయి. మ‌హిళా సాధికార‌త‌పై ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు ర‌త్న‌కుమార్. దీనికి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి.

ఈ చిత్రంలో న‌గ్నంగా న‌టించింది అమ‌లా పాల్. ఇదే ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. టీజ‌ర్ విడుద‌లైన‌పుడే సినిమాపై ఆస‌క్తి పెరిగిపోయింది. సినిమా విడుద‌లైన త‌ర్వాత మ‌రింత ర‌చ్చ పెరిగిపోయింది. సినిమాల్లో హీరోయిన్లు నగ్నంగా నటించడం కొత్తేమీ కాదు… కానీ హీరోయిన్లు నగ్నంగా నటించే సీన్లు సాధారణంగా సినిమాలో ఒకటో, రెండో ఉంటాయి. అవే కథలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఒక సినిమాలో సెకండ్ హాఫ్ అంతా నగ్నంగా నటించడం అంటే…. ఇప్పుడు “ఆమె” చేసిన ఈ పనే తెలుగు, తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అమలాపాల్ ప్రధాన పాత్రలో నటించిన ఆమె సినిమాలో అమలాపాల్ సెకండ్ హాఫ్ అంతా నగ్నంగానే కనిపిస్తుందట. అయితే హీరోయిన్ నగ్నంగా ఉన్నా.. ఎక్కడా అసభ్యతకు తావు లేకుండా జాగ్రత్తపడ్డాడట డైరెక్టర్. అందుకే ఇప్పుడు అమలాపాల్ నటకు ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రతి అమ్మాయి, వాళ్ల తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా అంటూ విమర్శకులు మెచ్చుకుంటున్నారు. అయితే సినిమా విడుదల ఆలస్యం కావడంతో ఫలితం కాస్త నిరాశ పరుస్తోంది.

Related posts

బాలయ్య 105వ చిత్రం థాయ్‌లాండ్‌ షెడ్యూల్ పూర్తి

vimala p

భూమ్మీద ఎక్కడ నక్కినా.. ఉగ్రవాదులను విడిచేదిలేదు ..! : మోడీ

vimala p

దేశంలోనే తొలిసారిగా.. భారతీయురాలిగా సర్టిఫికెట్.. ఇదే యువతలో రావాల్సింది..!

vimala p