telugu navyamedia
సినిమా వార్తలు

అమలాపాల్ “ఆమె” తమిళ ట్రైలర్

Aame

రత్నకుమార్ దర్శకత్వంలో అమలాపాల్ హీరోయిన్ గా రూపొందుతున్న చిత్రం “ఆమె”. తమిళంలో “ఆడై” టైటిల్ తో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను వీ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తుండగా చరిత చిత్ర, తమ్మారెడ్డి భరద్వాజలు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదలవ్వగా అందులో నగ్నంగా కన్పించి అందరికీ షాకిచ్చింది అమలాపాల్. ఇక టీజర్ విషయానికొస్తే ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ వీక్షకుల్ని ఆకట్టుకుంది. ప్రముఖులు సైతం సినిమా టీజర్ పై ప్రశంసలు కురిపించారు. టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్ రాబట్టింది. తాజాగా ఈ సినిమా త‌మిళ ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ ట్రైల‌ర్‌లో స‌న్నివేశాలు డేరింగ్ స‌న్నివేశాలున్నాయి. టీజ‌ర్‌లో బోల్డ్‌గా న‌టించిన అమ‌లాపాల్‌.. ట్రైల‌ర్‌లో సిగ‌రెట్ తాగే స‌న్నివేశం, మందు కొట్టే త‌ర‌హా డేరింగ్ స‌న్నివేశాల్లో న‌టించి ఆక‌ట్ట‌కుంది. సినిమాపై మాత్రం భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. తెలుగులో కూడా ఈ ట్రైల‌ర్ త్వ‌ర‌గానే విడుద‌ల కానుంది. తెలుగు, త‌మిళంలో ఈ సినిమాను జూలై 19న సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.

Related posts