telugu navyamedia
telugu cinema news

ఓ బేబీ : “ఆకాశంలోనా…” లిరికల్ సాంగ్ వీడియో సాంగ్

Oh-Baby

దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో “ఓ బేబీ” అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. “ఎంత సక్కగున్నావే” అనేది ట్యాగ్ లైన్. “మిస్ గ్రానీ” అనే కొరియన్ సినిమాను నందిని రెడ్డి రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో సమంత సరికొత్త లుక్ లో కనిపించనుంది. మిక్కి జె.మేయ‌ర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సురేశ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. సీనియర్ హీరోయిన్ లక్ష్మి ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించారు. ఊర్వశి, రాజేంద్రప్రసాద్, రావు రమేశ్, నాగశౌర్య ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్లకు మంచి స్పందన లభించింది. ఈ సినిమా వచ్చే నెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి “ఆకాశంలోనా…” అనే లిరికల్ సాంగ్ వీడియోను విడుదల చేశారు చిత్రబృందం. ఈ పాటను నూతన మోహన్ ఆలాపించగా… లక్ష్మీ భూపాల లిరిక్స్ అందించారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. మీరు కూడా ఈ పాటను వీక్షించండి.

Related posts

మహర్షి : సోల్ అఫ్ ది మహర్షి.. ఇదే కదా నీ కథ… లిరికల్ వీడియో

vimala p

చిరునవ్వుల సోయగం… నా చెలి…

vimala p

జయలలితగా రమ్యకృష్ణ… త్వరలోనే వెబ్ సిరీస్ ప్రీమియర్

vimala p