telugu navyamedia
సినిమా వార్తలు

“ఆకాంక్ష “..

aliveni poetry corner

వెలుగు కిరణాల 
వెతుకు లాట
వెలుగుపూల దారిలో 
వేచియున్న యవ్వనపు 
సిరి కోసమా 
వేచి చూద్దాం ! అన్నట్టు 

సుడులు తిరుగుతున్న 
ఆలోచన ల వెల్లువ 
విరగ పూసిన పూల 
సువాసనల మాధుర్యాన్ని 
ఆస్వాదించి 
మకరందపు ఝరే 
పారుతున్న సెలయేరయ్యింది.

వెతుకులాట లో దొరకని 
వయ్యారపు కోర్కెల మూట
ఉత్తుంగ తరంగమై 
విహరిస్తూ విరహా వేదనను 
అనుభవిస్తూ….. 
పరిపక్వత ఫలాలను 
ఏంట వేసుకొని 
ప్రాణ ప్రతిష్ఠుని  
కోసం పరితపిస్తూ 
పరువపు హోయలు 
ప్రాణ సకుని కోసం 
ఎదురు చూస్తున్నాయి 
ఆకాంక్ష ను నెరవేర్చుకోవాలి
అన్నట్లు !

-పాపారావు,
ముత్తనపల్లి 

Related posts