telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఆధార్ లింక్ : .. ఇకమీదట .. సామజిక మాధ్యమాలకు కూడా ..

aadhar linking for social media aslo

ఆధార్‌ అనుసంధానం దాదాపు అన్నిటికి ఖచ్చితం చేస్తుంది ప్రభుత్వం. అయితే ఇటీవల సామజిక మాధ్యమాలలో రెచ్చిపోతున్న తప్పుడు వార్తలను నిలువరించేందుకు కూడా ఈ ఆధార్ లింకింగ్ సరైన నిర్ణయమని కోర్టు కేంద్రప్రభుత్వానికి సూచించింది. ఈ నేపథ్యంలోనే వివిధ సామాజిక మాధ్యమాల్లో ఖాతాలకు అనుసంధానించే ఆలోచనేదైనా ఉందా? అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నకిలీ వార్తల వ్యాప్తిని నిరోధించేందుకు ఫేస్‌బుక్‌, ట్విటర్‌, వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి మాద్యమాల్లో ప్రస్తుతమున్న ఖాతాలకు వినియోగదారుల ఆధార్‌ నంబరును జోడించేలా ప్రణాళికలు వేయడం, విధివిధానాలు ఖరారు చేయడం వంటివేమైనా జరుగుతున్నాయా అని ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై సమాధానాన్ని సెప్టెంబరు 24లోపు చెప్పాలని సూచించింది. ఫేస్‌బుక్‌కు సంబంధించిన ఓ అభ్యర్థనపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ మేరకు కేంద్రానికి ఈ ప్రశ్నలు సంధించింది.

వివిధ హైకోర్టుల్లో తమ సంస్థపై ఉన్న పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలన్న ఫేస్‌బుక్ అభ్యర్థనను జస్టిస్‌ దీపక్‌ గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్ల బదిలీకి సంబంధించి ఏమైనా అభ్యంతరాలున్నాయా అని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. కేంద్రం తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషర్‌ మెహతా వాదనలు వినిపిస్తూ ఫేస్‌బుక్‌పై హైకోర్టుల పరిధిలో ఉన్న పిటిషన్లు సుప్రీంకోర్టుకు బదిలీ చేస్తే తమకేమీ అభ్యంతరం లేదని తెలిపారు. దీనిపై తమిళనాడు ప్రభుత్వం గతంలో అభ్యంతరం తెలిపింది. తమపై మద్రాస్‌ హైకోర్టులో రెండు పిటిషన్లు, బాంబే హైకోర్టు, మధ్యప్రదేశ్‌ హైకోర్టుల్లో ఒక్కో పిటిషన్‌ చొప్పున పెండింగ్‌లో ఉందని ఫేస్‌బుక్‌ తెలిపింది. వీటన్నింటినీ సుప్రీంకోర్టుకు బదిలీ చేస్తే తీర్పు సమయంలో పరస్ఫర భిన్నమైన తీర్పులు ఉండబోవని వెల్లడించింది. ఈ విషయంపై తదుపరి విచారణను సుప్రీం కోర్టు సెప్టెంబరు 24కు వాయిదా వేసింది.

Related posts