telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

గుర్తింపు కార్డుగా ఆధార్.. లోక్‌సభలో బిల్లు ఆమోదం

aadhar is not such an important

ప్రతిపక్షాల అభ్యంతరాల నడుమ ఆధార్ చట్ట సవరణ బిల్లును గురువారం లోక్‌సభలో ఆమోద ముద్ర పడింది. తాజా సవరణతో ఇకపై ఆధార్‌కార్డును గుర్తింపు కార్డుగా వినియోగించుకునే అవకాశం దక్కింది. బ్యాంకు ఖాతాలు, మొబైల్ కనెక్షన్లు తీసుకునేందుకు ఇకపై ఆధార్ కార్డును గుర్తింపు కార్డుగా స్వచ్ఛందంగా వినియోగించుకోవచ్చు. ఈ విషయంలో ఆధార్ కార్డు కోసం ఆయా సంస్థలు వినియోగదారులపై ఒత్తిడి చేయడానికి వీలు లేదు.

ఆధార్ చట్ట సవరణ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కాంగ్రెస్ నేత రంజన్ చౌధురీ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చట్టాల కోసం ఆర్డినెన్స్‌లను ఎంచుకుంటే ఇప్పటి ప్రభుత్వం ఆర్డినెన్స్‌లను చట్టాలుగా మార్చేసిందన్నారు. ఆధార్ చట్టాన్ని తామే తీసుకొచ్చామని అన్నారు. దీనికి న్యాయశాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ బదులిస్తూ యూపీయే ప్రభుత్వం ఆధార్ చట్టాన్ని తీసుకొస్తే తాము చట్టబద్ధత కల్పించామని పేర్కొన్నారు.

Related posts