telugu navyamedia
telugu cinema news

అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా రెండో షెడ్యూల్ స్టార్ట్… షూటింగ్ లో పూజాహెగ్డే

AA19

మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ త‌న 19వ‌ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తొలి షెడ్యూల్ ఇప్ప‌టికే పూర్తి చేసుకోగా, రెండో షెడ్యూల్ నేటి నుండి ప్రారంభం కానుంది. తాజాగా చిత్ర యూనిట్ ముస్లిం సోద‌రుల‌కి రంజాన్ శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ నేటి నుండి రెండో షెడ్యూల్ మొద‌లు కానుంద‌ని ప్రకటించారు. ఈ షెడ్యూల్‌లో చిత్ర క‌థానాయిక పూజా హెగ్డే టీంతో కలిసి షూటింగ్ లో పాల్గొననుంది. దాదాపు 30 రోజుల పాటు ఈ చిత్ర షెడ్యూల్‌ని హైద‌రాబాద్‌లో చేయనున్నారని తెలుస్తుంది. బ‌న్నీ, త్రివిక్ర‌మ్ కాంబినేషన్‌లో వ‌చ్చిన జులాయి, స‌న్ ఆఫ్ స‌త్య‌మూర్తి చిత్రాలు సూప‌ర్ స‌క్సెస్ సాధించ‌డంతో తాజా ప్రాజెక్ట్‌పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. మ‌రోవైపు వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్నీ చేస్తున్న‌ “ఐకాన్” సినిమాని త్వ‌ర‌లోనే సెట్స్ పైకి తీసుకెళ్ళేలా ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఏక‌కాలంలో ఈ రెండు సినిమాల షూటింగ్ జ‌రిపి, వ‌చ్చే ఏడాది ఒకేసారి రెండు సినిమాలతో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేసుకుంటున్నారట. త్రివిక్ర‌మ్ చిత్రం సంక్రాంతికి విడుద‌ల కానుండ‌గా, “ఐకాన్” చిత్రం స‌మ్మ‌ర్‌లో విడుదలవుతుంద‌ని అంటున్నారు.

Related posts

రణబీర్ కపూర్ పై కంగనా వ్యాఖ్యలు… స్పందించిన అలియా భట్

vimala p

“ప్యారిస్ ప్యారిస్” సినిమా సెన్సార్ సమస్యలు… కాజల్ స్పందన ఇదీ

vimala p

“జబర్దస్త్” వినోద్ పై దాడి… తీవ్రంగా గాయాలు

vimala p