telugu navyamedia
తెలుగు కవిత్వం సామాజిక

ఆ ఫోటో!

mana prema poetry corner
గతాన్ని తవ్వుతూ పోతున్నాను!
పురావస్తు శాఖ వారు 
చరిత్ర ఆనవాళ్ల కోసం తవ్వినట్టు
కాలపు పొరల్లో ఎక్కడ పడిపోయిందో 
తెలియని ఓ ఫోటో కోసం.
ఎంత శోధించినా 
నా ఆలోచనా గునపానికి 
దాని జాడ తగలడం లేదు.
రెండు దశాబ్దాల జ్ఞాపకాలను
వడ పోయడమంటే అంత సులువు కాదు కదా!
ఇప్పుడంటే మంత్రజాలం చేసే
చరవాణీలు అరచేతిలోనో ఉన్నాయి గానీ
దూరవాణి కూడా 
స్వప్న దూరమైన ఆ రోజుల్లో
ఆ ఒక్క ఫొటో సంపాదించడానికి
ఎంత కష్టపడ్డానని!
నిత్యం ఆ ఫోటోని చూస్తూ
మౌన బాషలో ఎన్ని ఊసులాడానో! 
నిజం కాని నా అదృష్టం గురించి
ఎన్ని కలలు తీవెలను పెంచానో మరి!
రంగుల హంగులతో కనికట్టు చేసే
ఫోటోలు ఇపుడెన్నున్నా
కృత్రిమత్వం ఇసుమంతైనా కానరాని
ఆ ఫోటోయే ఎంతో ప్రత్యేకం!
సిరా (సింగారపు రాజయ్య)
ఇల్లందు

Related posts