telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఏ1 ఎక్స్‌ప్రెస్ ట్రైలర్ రిలీజ్

టాలెంటెడ్ హీరో సందీప్ కిష‌న్ న‌టిస్తోన్న లేటెస్ట్ న్యూ-ఏజ్ స్పోర్ట్స్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’. లావ‌ణ్యా త్రిపాఠి హీరోయిన్‌. డెన్నిస్ జీవ‌న్ క‌నుకొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌ర్‌, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషెక్ అగ‌ర్వాల్‌, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం నిర్మిస్తున్నారు.ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో అమితాస‌క్తి వ్య‌క్త‌మ‌వుతుండ‌గా, త‌న హాకీ స్కిల్స్‌తో సందీప్ కిష‌న్ అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌చ‌కితుల్ని చేస్తున్నారు. టాలీవుడ్‌లో రూపొందుతోన్న తొలి హాకీ ఫిల్మ్‌గా గుర్తింపుపొందిన ఈ చిత్రంలో హిప్ హాప్ తమిళ స్వ‌రాలు కూర్చిన “సింగిల్ కింగులం” సాంగ్ ఇప్ప‌టికే సూప‌ర్ హిట్ట‌యింది.  ఇండియాలోనే అతిపెద్ద‌, ఉత్త‌మ హాకీ స్టేడియం అయిన‌ పంజాబ్‌లోని మొహాలి స్టేడియంలో ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ క్లైమాక్స్ సీక్వెన్స్‌ల‌ను పూర్తి చేశారు. భార‌త‌దేశ‌పు టాప్ హాకీ ఫిలిమ్స్ అయిన ‘చ‌క్ దే ఇండియా’, ‘సూర్మ’ షూటింగ్‌ల‌ను జ‌రిపింది ఈ స్టేడియంలోనే కావ‌డం గ‌మ‌నార్హం.  ఇది ఇలా ఉండగా.. గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్‌. క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ అందరినీ ఆకట్టుకుంటుంది. 

Related posts