telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలయ్యకే ఝలక్‌ ఇచ్చిన యంగ్‌ హీరో..!

Balakrishna

బోయపాటి గురించి ప్రత్యేక ప్రరిచయం అవసరం లేదు. ఈ దర్శకుడి పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఇతడి సినిమా అంటే చాలు పవర్ ఫైల్ ఫైట్‌లు, డైలాగ్‌లు అలా కళ్లముందు మెదులుతాయి. ఇక బోయపాటి, బాలయ్య కాంబో గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాల విజయాల గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. వీరు ప్రస్తుతం వీరి కాంబోలో మూడో సినిమాను తెరకెక్కిస్తున్నారు. అందులో బాలయ్యకు విలన్ కోసం దర్శకనిర్మాతలు నటీనటులు అందరినీ జల్లెడ వేసి మరీ వెతుకుతున్నారు. ఇందులో భాగంగా బోయపాటి ఓ యంగ్ హీరోను కలిశాడట. క్యారెక్టర్ వినగానే అతడు బెంబేలెత్తిపోయి, నో చెప్పేశాడట. అయితే ఆ యంగ్ హీరో ఎవరో తెలుసా. స్వామిరారా, కార్తీకేయా సినిమాలతో మంచి మార్కులు తెచ్చుకున్న నిఖిల్ సిద్దార్థ. అయితే బోయపాటి సినిమాలో హింస భారీగా ఉంటుందని, అందులోనూ నెగిటివ్ రోల్ అంటే మితిమీరిన హింస ఉంటుందన్న ఆందోళనతో రిస్క్ అనుకొని రెజెక్ట్ చేశాడట. ఈ యంగ్ హీరో నిఖిల్ ఈ ఏడాదే వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం కార్తికేయా2 సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

Related posts