Trending Today వార్తలు సామాజిక

ఆ వధువు గొప్ప ఆలోచన… పెళ్లి కోసం దాచిన డబ్బును వరద బాధితులకు…

Bihar Prisons help 21000 to Kerala Floods

కేరళ రాష్ట్రంలో తీవ్ర వరదల కారణంగా ఎందరో నిరాశ్రయులయ్యారు. వారందరికీ అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం తగిన సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు. అలాగే ఈ సంఘటనను గురించి తెలిసిన భారతీయులు అందరూ దీనిపై స్పందించి వారికి తోచిన సాయాన్ని ప్రకటిస్తున్నారు. మరొకొందరు వాలంటీర్ లుగా ఆయా ప్రాంతాలలో కేరళ వాసులకు ప్రత్యక్ష సాయాన్ని అందిస్తున్నారు. దేశమలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారివారి సాయాన్ని ప్రకటించాయి.

సినీ వర్గాలు కూడా కేరళకు సాయాన్ని ప్రకటించారు…తాజాగా ఓ యువతి చేసిన సహాయం ప్రస్తుతం పలువురికి ఆదర్శంగా నిలిచింది… ఏకంగా తన పెళ్లి కోసం, పెళ్లి నగలకు దాచుకున్న సొమ్మును వరద బాధితుల సహాయార్థం ప్రకటించింది… వివరాల ప్రకారం..

a Woman donate Wedding Jewel Money to Kerala Floods

బెంగళూర్ నగరంలోని ఉద్యోగం చేస్తున్న కోజికోడ్ జిల్లా వటకార ప్రాంతానికి చెందిన అమృత అనే యువతికి వచ్చే నెల 15వ తేదీన వివాహం నిశ్చయమైంది… కుటుంబ సభ్యులందరు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు.. అయితే ఉద్యోగం చేస్తున్న కారణంగా పెళ్లి నగల కోసమని అమృత లక్ష రూపాయలను జమ చేసింది… కేరళ రాష్ట్రంలో వరద బీభత్సం చూసిన అమృత మనసు అతలా కుతమవడంతో నగలకోసమని దాచి పెట్టుకున్న ఆ లక్ష రూపాయలను విరాళంగా ఇచ్చేసింది.. అంతే కాదు…

a Woman donate Wedding Jewel Money to Kerala Floods

ఈ విషయాన్నీ తనకు కాబోయే భర్తకు కూడా చెప్పింది.. పెళ్ళిలో నగలు ధరించనని చెప్పడంతో ఆమె చేసిన సహాయం మొదట కొంత బాదేసినప్పటికీ ఆడంబరాలు లేకుండా పెళ్లి జరగదా అన్న విషయంగా ఆలోచించి అందరు సమ్మతించారు.. కాబోయే భర్త కూడా ఆమె మంచి మనసును చూసి అమృతను కొనియాడారు… కాగా ఆ లక్ష రూపాయల చెక్ ను అమృత తండ్రి వేణు కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు… ఆమె చేసిన ఈ సహాయం పలువురికి ఆదర్శంగా నిలుస్తుంది..

Related posts

భారత న్యాయ వ్యవస్థ ప్రమాదంలో ఉంది : కపిల్ సిబాల్

admin

ఈ చిన్న ఆలయంపై నెలలోనే మూడు సార్లు దొంగతనం.. విలువైన వస్తువులు చోరీ

nagaraj chanti

తెరాస అలా అనడం సబబు కాదు : జానారెడ్డి

admin

Leave a Comment