telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఉబర్ అనుకుని వేరే కారెక్కిన అమ్మాయి… 14 గంటల పాటు నరకం…

Girl

ఈ ఘోరమైన ఘటన సిడ్నీలో చోటు చేసుకుంది. స్కూల్ ముగిసిన తరువాత ఇంటికి బయలుదేరిన ఆ అమ్మాయి ఉబర్ కారు బుక్ చేసుకుంది. కాసేపటికి తన ముందుకొచ్చిన కారు చూసి అదే ఉబర్ కారనుకుంని అందులో కూర్చుంది. కొంతదూరం వెళ్లిన తరువాత కారు దారిమళ్లినట్లు గుర్తించిన ఆమె ఎటు వెళ్తున్నామని డ్రైవర్‌ను ప్రశ్నించింది. దాంతో అతను కారు ఆపేశాడు. కిందకు దిగి వెనక సీట్లో అమ్మాయి పక్కనే కూర్చొని కారు దిగిపోయే ప్రయత్నం చేస్తున్న ఆమెపై కారులోనే రెండుసార్లు అత్యాచారం చేసి ఊరికి దూరంగా ఉన్న ఓ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ అతని కోసం ఎదురుచూస్తున్న ఇద్దరు మిత్రులు కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. వారిలో ఓ వ్యక్తి ఈ దారుణాన్ని కెమెరాలో బంధించాడు. ఇలా 14 గంటలపాటు నరకం అనుభవించిన ఆమె సమయం చూసి తన మిత్రులకు మెసేజ్‌లు పెట్టింది. అనంతరం ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయింది. మార్గమధ్యంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు ఆమెను చూసి.. విషయం తెలుసుకున్నారు. వెంటనే ఆమెను బంధించి ఉంచిన ఇంటి వద్దకు వెళ్లి అక్కడే ఉన్న నిందితులు ముస్తఫా యూసెబసోగ్లు, రూహీ దగ్డనాసర్‌తోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 2016లో జరిగిన ఈ ఘటనపై విచారణ జరిపిన కోర్టు.. ఇటీవలే రూహీకి 24 ఏళ్లు, వీడియో తీసిన నిందితుడికి 26 ఏళ్లు శిక్ష విధించింది. ప్రధాన నిందితుడైన ముస్తఫా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Related posts