telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మిస్ మ్యాచ్ : త్రివిక్రమ్ చేతుల మీదుగా “అరెరే అరెరే…” సాంగ్ విడుదల

Miss-Match

అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న చిత్రం “మిస్ మ్యాచ్”. ఉదయ్ శంకర్, ఐశ్వ‌ర్యా రాజేశ్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. నిర్మ‌ల్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 6న విడుద‌ల కానుంది. ఈ సినిమాలో “అరెరే అరెరే…” అనే సాంగ్‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా డైరెక్టర్ త్రివిక్రమ్ మాట్లాడుతూ “మిస్ మ్యాచ్” ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగ్గ సినిమా అవుతుందని భావిస్తున్నాను. హీరో ఉదయ్ శంకర్ కు నటుడిగా మంచి భవిష్యత్ ఉంది. ఇప్పుడు రిలీజ్ అయిన ‘అరెరే అరెరే’ మెలోడీ సాంగ్, వినాలనిపించేదిగా ఉంది“ అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో హీరో ఉద‌య్ శంక‌ర్‌, నిర్మాత శ్రీరామ్‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఇలియాస్‌, డైరెక్ట‌ర్ ఎన్.వి.నిర్మ‌ల్ పాల్గొన్నారు.


Related posts